Thursday, July 22, 2010

System Restore Manager - విండోస్ సిస్టం రీస్టోర్ పాయింట్లను మేనేజ్ చెయ్యటానికి...

ఏదైనా క్రొత్త అప్లికేషన్/ సాప్ట్ వేర్ లేదా డ్రైవర్లు ఇనస్టలేషన్ చేసేటప్పుడు విండోస్ లో సిస్టం రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ క్రొత్త సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసిన తర్వాత పీసీ సరిగా పనిచెయ్యనపుడు ఆ రీస్టోర్ పాయింట్ ని ఉపయోగించి తిరిగి దానిని సరిగా పనిచేసిన డేట్ కి రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలా రీస్టోర్ పాయింట్లు క్రియేట్ చేసుకుంటూ పోతే ఎక్కువ హార్డ్ డిస్క్ స్పేస్ వ్రుధా అయ్యే అవకాశం వుంది. System Restore Manageర్ పేరుకి తగ్గట్లుగానే సిస్టం రీస్టోర్ పాయింట్ల ను మేనేజ్ చెయ్యటం లో సహాయపడుతుంది. దీనిని ఉపయోగించి అనవరమైన సిస్టం రీస్టోర్ పాయింట్ల ను తొలగించవచ్చు మరియు ముఖ్యమైన వాటిని ఉంచుకోవచ్చు. దీనిని ఉపయోగించి రీస్టోర్ పాయింట్ల కావలసిన లోకేషన్ లో సేవ్ చేసుకోవచ్చు మరియుఆ రీస్టోర్ పాయింట్ ఎంతకాలం వుంచాలో మొదలగునవి సెట్ చేసుకోవచ్చు.




మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు System Restore Manager సైట్ చూడండి.

ధన్యవాదాలు