పీసీ లో పేరుకుపోయిన అనవసరమైన ఫైళ్ళను తొలగించటానికి ప్రముఖ
CCleaner ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మనం ఉపయోగించే సాప్ట్ వేర్లు పెరగటం తో CCleaner కొన్నిటికి సంబంధించిన అనవసర ఫైళ్ళను తొలగించటం లో విఫలమవుతుంది. దానికోసం CCEnhancer అనే పోర్టబుల్ ప్రోగ్రామ్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇది CCleaner లో 450 పైగా ప్రోగ్రామ్స్ ని జతచేసి CCleaner వాటిని సపోర్ట్ చేసేలా చేస్తుంది, ఇక CCleaner మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది.
CCEnhancer ని రన్ చేసుకోవాలంటే ముందు CCleaner మన పీసీ లో ఉండాలి, లేకున్నా CCEnhancer రన్ చేసే సమయంలో కూడా CCleaner ని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. CCleaner ఒకవేళ ముందుగా ఉంటే కనుక CCEnhancer రన్ చేస్తే ఈ క్రింద చిత్రం లో చూపిన విధంగా వస్తుంది, అక్కడ ’Download' పై క్లిక్ చేసి లేటెస్ట్ డెఫినిషన్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు CCleaner లోని Applications టాబ్ లో CCEnhancer క్రొత్తగా యాడ్ చేసిన ప్రోగ్రాములను చూడవచ్చు. పైన చెప్పినట్లు 450 ప్రోగ్రాములు కనబడవు కాని, అన్ని సపోర్ట్ చేస్తుంది, మన పీసీ లో ఇనస్టలేషన్ చేసిన సాప్ట్ వేర్లకు సంబంధినవి మాత్రమే కనబడతాయి.
మరింత సమాచారం మరియు CCEnhacer డౌన్లోడ్ కొరకు
ఇక్కడ చూడండి.
డౌన్లోడ్:
CCEnhancer
ధన్యవాదాలు