Monday, April 18, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: “Don’t forget Bob” మరియు “Got the wrong Bob?”

జీమెయిల్ లో ఇప్పుడు రెండు క్రొత్త ఫీచర్లు జత చెయ్యబడ్డాయి అవే “Don’t forget Bob” మరియు “Got the wrong Bob?”. ఈ ఫీచర్లు మనం పంపే మెయిల్ అందరికీ పంపటంలో మరియు సరైన వ్యక్తికి పంపటం లో సహాయపడతాయి. అదెలాగో ఇప్పుడూ చూద్దాం ముందుగా మొదటి ఫీచర్ “Don’t forget Bob” గురించి తెలుసుకుందాం. ఒకే మెయిల్ ని మనం కొందరు వ్యక్తులకు గ్రూప్ గా ఒకేసారి పంపుతూ ఉంటాం. మరోసారి అదే గ్రూప్ లో ఎవరికైనా మెయిల్ పంపేటప్పుడు Also include:...... అని మనం ఇంతకుముందు పంపిన గ్రూప్ కి చెందిన వ్యక్తుల మెయిల్ ఐడీలను ఆటోమాటిక్ గా సజెస్ట్ చేస్తుంది.


అదేవిధంగా సజెస్ట్ చేసిన ఐడీకి బదులుగా తప్పు ఐడీ యాడ్ చేసినప్పుడు సరైన దానిని మరల సజెస్ట్ చేస్తుంది “Got the wrong Bob?”), అప్పుడు Did you mean:.......అని వస్తుంది.


మరింత సమాచారం కోసం జీ-మెయిల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు