Thursday, April 7, 2011

Yahoo Safely : తల్లిదండ్రులకు మరియు పిల్లలకోసం ఇంటర్నెట్ సేఫ్టీ టిప్స్

టీనేజ్ పిల్లలున్న ఇళ్ళలో ఇంటర్నెట్ వాళ్ళకు ఇవ్వాలంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటాం. నెట్ బ్రౌజింగ్ సురక్షితమా కాదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. పిల్లలు నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు వారి ప్రక్కనే ఉండాలనుంటుంది, కాని అది వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇటువంటి పరిస్థితిలో నెట్ సురక్షితంగా బ్రౌజ్ చెయ్యటానికి తల్లిదండ్రులు మరియు పిల్లల కోసం యాహూ కొన్ని వాల్యూబుల్ టిప్స్ ని అందిస్తుంది యాహూ సేఫ్లీ అనే సైట్ లో. ఇంటర్నెట్ సెక్యూరిటీ సలహాల కోసం ఈ సైట్ ని సందర్శించవచ్చు. టిప్స్ కంప్యూటర్లకే కాక స్మార్ట్ ఫోన్స్ కి కూడా ఉన్నాయి. పేరెంట్స్ కి మరియు టీనేజర్స్ కి టిప్స్ విడివిడి గా ఉన్నాయి.





వెబ్ సైట్: Yahoo Safely

ధన్యవాదాలు