Tuesday, April 5, 2011

సైబర్ క్రైమ్ హెల్ప్ : సైబర్ నేరాల బాధితులు ఇక్కడ సంప్రదించవచ్చు

కంప్యూటర్ ఎరా నల్లమోతు శ్రీధర్ గారు, మరికొందరి సహకారం తో నడుస్తున్న సైబర్ క్రైమ్ హెల్ప్ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వెయ్యటం లో ఎంతో సహాయపడుతుంది. ఈ-మెయిల్స్ ద్వారా వేధించటం, సోషల్ నెట్‍వర్కింగ్ సైట్ల లో ఐడెంటిటీ దొంగిలించటం, డబ్బు సంపాదించవచ్చని చెప్పే ఆన్ లైన్ జాబ్ లు, లాటరీ తగిలిందంటూ వచ్చే మెయిల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు క్రెడిట్ కార్డ్ వివరాలు తస్కరించటం, బ్లాగుల్లో వ్యక్తులను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా వ్రాయటం మొదలగు సైబర్ నేరాలకు సంబందించిన బాధితులు సైబర్ క్రైమ్ హెల్ప్ వారిని సంప్రదించి వారి సహాయంపొందవచ్చు.


సైబర్ క్రైమ్ హెల్ప్ వారు పరిష్కరించిన కొన్ని కేసులను ఆ సైట్ లో చూడవచ్చు.

వెబ్ సైట్: సైబర్ క్రైమ్ హెల్ప్

సేకరణ: కంప్యూటర్ ఎరా ఏప్రిల్ 2011 మాసపత్రిక నుండి.

ధన్యవాదాలు