Wednesday, April 13, 2011

Personal Blocklist [క్రోమ్ ఎక్స్ టెన్షన్] - అనవసరమైన సెర్చ్ రిజల్ట్స్ ని బ్లాక్ చెయ్యటానికి

అనవసరమైన సెర్చ్ రిజల్ట్స్ ని బ్లాక్ చెయ్యటానికి Personal Blocklist అనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ ఉపయోగపడుతుంది మరియు అవసరం అనుకుంటే అన్-బ్లాక్ కూడా చేసుకోవచ్చు.Personal Blocklist ఎక్స్ టెన్షన్ ని క్రోమ్ వెబ్ స్టోర్ కి వెళ్ళి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత బ్రౌజర్ అడ్రస్ బార్ ప్రక్కన ఎరుపు వ్రుత్తం లో చేతి బొమ్మను చూడవచ్చు, అదే Personal Blocklist. ఇప్పుడు గూగుల్ సెర్చ్ వెళ్ళి కావలసిన అంశాన్ని సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ లో సైట్స్ URL ప్రక్కన Block ఆయా URL ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్ లో ఆ సైట్ URL బ్లాక్ అయిపోతుంది.


ఇప్పుడు Personal Blocklist గుర్తు పై క్లిక్ చేసి బ్లాక్ చేసిన లింకులను చూడవచ్చు, అక్కడ బ్లాక్ చేసిన లింకుల దగ్గర Unblock, Edit ఉంటాయి, అవసరం అనుకుంటే Unblock చేసుకోవచ్చు.



Personal Blocklist ఇనస్టలేషన్ మరియు ఇతర సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు