Wednesday, April 20, 2011

అనాథరైజ్డ్ యాక్సెస్ నుండి కాపాడటానికి ఫేస్‍బుక్ క్రొత్త సెక్యూరిటీ ఫీచర్!!!

ఇతరులు మన ఫేస్‍బుక్ అకౌంట్ లోకి చొరబడకుండా ఉండటానికి మరియు సురక్షిత బ్రౌజింగ్ కొరకు ఫేస్‍బుక్ సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలి, దానికోసం ముందుగా ఫేస్‍బుక్ లాగిన అయిన తర్వాత Account ---> Account settings ---> Account Security దగ్గర change పై క్లిక్ చేసి క్రింద చిత్రం లో చూపిన విధంగా అక్కడ వచ్చే ఆప్షన్ల దగ్గర టిక్ పెట్టి సేవ్ చేసుకోవాలి.

మొదటిది HTTPS సపోర్ట్ సురక్షిత బ్రౌజింగ్ కొరకు దీనిని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక రెండవది మనం లేదాఎవరైనా  ఏదైనా క్రొత్త కంప్యూటర్ లేదా మొబైల్ డివైజ్ లో మన ఫేస్‌బుక్ అకౌంట్ తో లాగిన్ అయినప్పుడు కోడ్ ఎంటర్ చెయ్యమని అడుగుతుంది.

మరింత సమాచారం కొరకు ఫేస్‌బుక్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు