Monday, April 25, 2011

డ్రాప్‍బాక్స్ లో ఫైళ్ళను శాశ్వతంగా తొలగించటం ఎలా?

ఉచిత ఆన్‍లైన్ స్టోరేజ్ కోసం సాధారణంగా మనం Dropbox ని ఉపయోగిస్తూ ఉంటాం, దీనిలో ఒక ప్రయోజనం కూడా ఉంది అది ఏమిటంటే పొరపాటున తొలగించిన ఫైళ్ళను తిరిగి రీస్టోర్/రికవర్ చేసుకోవచ్చు. మనం తొలగించిన ఫైల్స్ అన్నీడ్రాప్‍బాక్స్ లో Show Deleted Files అనే టాబ్ లో ఉంటాయి. అయితే మనం తొలగించిన ఫైళ్ళను రికవర్ లేదా అనవసరం అనుకుంటే శాశ్వతంగా కూడా తొలగించవచ్చు. దానికోసం ముందుగా శాశ్వతంగా తొలగించవలసిన ఫైళ్ళను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న More పై క్లిక్ చేసి Permanently Delete పై క్లిక్ చెయ్యాలి. లేదంటే కనుక సెలెక్ట్ చేసిన ఫైల్ చివరన ఉన్న డ్రాప్‍డౌన్ యారో పై క్లిక్ చేసినా కూడా ఆ అప్షన్ వస్తుంది.

దీనికి సంబంధించి లాబ్‍నాల్ వీడియో చూడండి.



ధన్యవాదాలు