Tuesday, July 27, 2010

Start My Day - కావలసిన అప్లికేషన్లను, వెబ్ సైట్లను, పాటలను ఆటోమాటిక గా లోడ్ చెయ్యటానికి!!!

పీసీ ఆన్ చెయ్యగానే రోజూ రెగ్యులర్ గా కొన్ని పనులు చేస్తూవుంటాం ... మెయిల్ చెక్ చేసుకోవటం , నచ్చిన సైట్ చూడటం, పాటలను ప్లే చెయ్యటం ... రోజూ ఓపెన్ చెయ్యవలసిన అప్లికేషన్లను, వెబ్ సైట్లను లేదా మ్యూజిక్ ఆటోమాటిక్ గా ఓపెన్ చెయ్యటానికి Start My Day అనే ఉచిత అప్లికేషన్ సహాయపడుతుంది. ఇది విండోస్ విస్టా మరియు 7 కోసం రూపొందించబడినది. Start My Day లో వున్న Apps, Web, Music టాబ్స్ లో కావసిన అప్లికేషన్/వెబ్ లింక్స్/ పాటలను డ్రాగ్ అండ్ డ్రాప్ పధ్ధతిలో జత చెయ్యవచ్చు. ఇక్కడ జత చెయ్యబడిన అప్లికేషన్లు అలారమ్ క్లాక్ ని ఉపయోగించి ఆటోమాటిక్ గా లోడ్ అవుతాయి. ఆటోమాటిక్ గా వద్దనుకొంటే లిస్ట్ లోని వాటిని మాన్యువల్ గా కూడా రన్ చేసే సదుపాయం వుంది. అప్లికేషన్ లిస్ట్ లో .exe ఫైళ్ళను, వెబ్ లిస్ట్ లో .url ఫైళ్ళను మరియు మ్యూజిక్ లిస్ట్ లో .MP3 ఫైళ్ళను మాత్రమే అనుమతిస్తుంది.




మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Start My Day

ధన్యవాదాలు

Monday, July 26, 2010

PortableLinuxApps - Linux యూజర్ల కోసం పోర్టబుల్ అప్లికేషన్లు అన్నీ ఒకేచోట...

పోర్టబుల్ అప్లికేషన్లను ఫ్లాష్ డ్రైవ్ లలో కాపీ చేసుకొని మనతో పాటు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు మరియు అవసరమైన ఆ అప్లికేషన్లను వాడుకోవచ్చు. ఇంతకుముందు కొన్ని పోస్టులలో విండోస్ కోసం అవసరమయ్యే పోర్టబుల్ అప్లికేషన్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు Linux యూజర్లు కూడా http://www.portablelinuxapps.org/ సైట్ కి వెళ్ళి పోర్టబుల్ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకొని తమ ఫ్లాష్ డ్రైవ్ లలో క్యారీ చెయ్యవచ్చు. ఈ పోర్టబుల్ అప్లికేషన్ల సమాహారం లో BitTorrent clients, media players, instant messaging clients, drawing tools, compression tools, note taking tools, graphics tools, audio editors, ఇలా ఇంకా చాలానే ఉన్నాయి.



వెబ్ సైట్: PortableLinuxApps

ధన్యవాదాలు

Friday, July 23, 2010

MeeGenius - పిల్లల కోసం ఉచిత ఈ-బుక్స్

MeeGenius వెబ్ సైట్ లో పిల్లల ఇష్టమైన కధలను ఈ-బుక్స్ రూపంలో ఉచితంగా అందిస్తున్నారు. కావాలనుకొంటే కధలలోని పాత్రల పేర్లు మార్చుకోవచ్చు. అంటే పర్సనలైజ్డ్ ఈ-బుక్స్ అన్నమాట, కధలను చదవటమే కాదు వినవచ్చు కూడా... పిల్లలకు ఈ సైట్ బాగా నచ్చుతుంది.



సైట్: MeeGenius

ధన్యవాదాలు

Comodo Internet Security - కొమోడో నుండి ఉచిత సెక్యూరిటీ సూట్

ప్రముఖ కొమోడో వారు రూపొందించిన మరొక ఉచిత సెక్యూరిటీ సూట్ - Comodo Internet Security. దీనిలో ఉచిత యాంటీ వైరస్ తో పాటు ఉచిత ఫైర్ వాల్ కూడా వుంది. ఇంటర్నెట్ లో ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు దీనిలోని ఉచిత malware prevention software మన పీసీ ని త్రెట్స్ నుండి కాపాడి సేఫ్ బ్రౌజింగ్ ని అందిస్తుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ ని కలిగి పీసీ ని సురక్షితంగా ఉంచటం లో Comodo Internet Security ఒక మంచి ఉచిత సెక్యూరిటీ సూట్ అని చెప్పవచ్చు.


డౌన్లోడ్: Comodo Internet Security

కొమోడో వారి మరొక ఉచిత టూల్ Comodo Cloud Scanner - ఇది ఒక ఉచిత ఆన్ లైన్ మాల్వేర్ డిటెక్షన్ యుటిలిటీ. మాల్వేర్ నుండి పీసీ ని కాపాడటం లో సహాయపడుతుంది.


డౌన్లోడ్: Comodo Cloud Scanner

ధన్యవాదాలు

Thursday, July 22, 2010

System Restore Manager - విండోస్ సిస్టం రీస్టోర్ పాయింట్లను మేనేజ్ చెయ్యటానికి...

ఏదైనా క్రొత్త అప్లికేషన్/ సాప్ట్ వేర్ లేదా డ్రైవర్లు ఇనస్టలేషన్ చేసేటప్పుడు విండోస్ లో సిస్టం రీస్టోర్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ క్రొత్త సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసిన తర్వాత పీసీ సరిగా పనిచెయ్యనపుడు ఆ రీస్టోర్ పాయింట్ ని ఉపయోగించి తిరిగి దానిని సరిగా పనిచేసిన డేట్ కి రీస్టోర్ చేసుకోవచ్చు. ఇలా రీస్టోర్ పాయింట్లు క్రియేట్ చేసుకుంటూ పోతే ఎక్కువ హార్డ్ డిస్క్ స్పేస్ వ్రుధా అయ్యే అవకాశం వుంది. System Restore Manageర్ పేరుకి తగ్గట్లుగానే సిస్టం రీస్టోర్ పాయింట్ల ను మేనేజ్ చెయ్యటం లో సహాయపడుతుంది. దీనిని ఉపయోగించి అనవరమైన సిస్టం రీస్టోర్ పాయింట్ల ను తొలగించవచ్చు మరియు ముఖ్యమైన వాటిని ఉంచుకోవచ్చు. దీనిని ఉపయోగించి రీస్టోర్ పాయింట్ల కావలసిన లోకేషన్ లో సేవ్ చేసుకోవచ్చు మరియుఆ రీస్టోర్ పాయింట్ ఎంతకాలం వుంచాలో మొదలగునవి సెట్ చేసుకోవచ్చు.




మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు System Restore Manager సైట్ చూడండి.

ధన్యవాదాలు

Tuesday, July 20, 2010

ScanDrop - స్కాన్ చేసిన డాక్యుమెంట్లను డైరెక్ట్ గా గూగుల్ డాక్స్ కి పంపటానికి!!!

ScanDrop అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి స్కాన్ చేసిన డాక్యుమెంట్లని నేరుగా Google Docs లేదా Evernote కి పంపవచ్చు. అప్ లోడ్ చేసే ముందు ఇమేజ్ రొటేట్ లేదా రీఎరేంజ్ చేసుకోవచ్చు. విండోస్ సిస్టం కి కనెక్ట్ అయిన దాదాపు అన్ని స్కానర్లలో ScanDrop పనిచేస్తుంది.

ScanDrop కి సంబంధించిన వీడియో:



డౌన్లోడ్: ScanDrop

ధన్యవాదాలు

Monday, July 19, 2010

System Nucleus - విండోస్ మెయింటెనెన్స్ టూల్స్ అన్నీ ఒకేచోట!!!

System Nucleus అనే పోర్టబుల్ సిస్టం మెయింటెనెన్స్ యుటిలిటీ లో టూల్స్ అన్నీ ఒకే ప్యాకేజ్ గా వస్తాయి, వాటిలో కొన్ని ప్రాసెస్ మేనేజ్మెంట్, స్టార్ట్ అప్ ప్రోగ్రామ్ ఎడిటర్, బ్యాక్ అప్ మరియు రికవరీ టూల్స్ యిలా ఇంకా చాలానే...



ఫీచర్లు:

System Audit - detailed report of what's on & in your computer, and how its all configured. Generate & save an HTML version, ideal for tracking changes over time and providing diagnostic information to technical support.
System Editor - configure thousands of settings from a single, easy to use & navigate interface. Includes QuickFix functionality for addressing common concerns, such as resolving network connectivity issues & optimizing performance. The Standard Mode provides easy access to the most popular settings, while the Advanced Mode exposes a highly granular view for precise tweaking.
Startup Manager - see everything that runs & loads when your computer is started and when someone logs in. Delete those you don't need, disable those you aren't sure about or don't want to load temporarily, and enable items previously disabled.
Backup & Recovery - its always a good idea to backup your current configuration before making changes just in case something goes wrong. Backup your selection of registry hives, event logs, and drivers, or create a System Restore Point. Is your computer not functioning properly? Restore a previously created Restore Point to put your computer's configuration back where it was before you started having problems.
Windows Application Menu - shortcuts to over 100 applications & tools included with Windows, many of which are not accessible via the Start Menu. Automatically determines which programs are on your system and displays only those shortcuts, organized into 5 categories: Administrative Tools, Network, Security, System, and Diagnostic & Repair.
System Tray Menu - optionally display an icon in the system tray that provides quick access to numerous tools and applications, a Run command prompt, system information, and environment settings, as well as the main System Nucleus interface.
Program Manager - view detailed information on installed programs, modify & uninstall applications, and delete old install entries. Edit program info such as support links & contact details.
Disks & Drives - create detailed, graphical analysis reports on storage volumes, check disks & defragment.
Detailed Information - view & edit properties of the selected item in the Detail panel, with links to additional online resources. Dock the Details on the left or right, set it to auto hide, and access it easily from the right-click context menu.
Smart Run - store run commands between sessions, browse for executable, integrated RunAs option with option to save usernames, and create your own shortcut aliases to frequently entered commands. Always visible in the main menu bar & system tray menu for quick, easy access.
Customizable, SetOnce Interface - select how much or how little information is displayed, reorder & resize columns, apply filters & sorting, choose what actions require confirmation, arrange & auto hide panels, and never have to do it twice. Your customized interface is maintained so next time you start System Nucleus it looks the same as when it was closed.

డౌన్లోడ్: System Nucleus

ధన్యవాదాలు

Comodo Verification Engine - ఉచిత వెబ్ సైట్ వెరిఫికేషన్ యుటిలిటీ

మనం బ్రౌజ్ చేస్తున్న వెబ్ సైట్ సురక్షితమైనదా మరియు నమ్మదగినదా అని తెలుసుకోవటానికి Comodo Verification Engine అనే ఉచిత సైట్ వెరిఫికేషన్ యుటిలిటీ సహాయపడుతుంది. కొన్ని సైట్లు మనకు తెలియకుండానే మన పీసీ వైరస్ ని చొప్పిస్తాయి మరికొన్ని సైట్లు మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి. అందుకే మనం ఏదైనా సైట్ సురక్షితమైనదా కాదా అని తెలుసుకోవటం ఎంతైనా అవసరం.

Comodo Verification Engine బ్రౌజర్ ప్లగిన్ ఇది ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్ ఫాక్స్, సీమంకీ మరియు నెట్ స్కేప్ ని సపోర్ట్ చేస్తుంది. కొమోడో సైట్ కి వెళ్ళి వెరిఫికేషన్ ఇంజిన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత Comodo Verification Engine సిస్టం ట్రే లో కూర్చుంటుంది. మనం బౌజర్ లో ఏదైనా సైట్ అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు అది సురక్షితమైనదా కాదో తెలియచేస్తుంది, అడ్రస్ బార్ లో వున్న తాళం గుర్తు పై మౌస్ ని ఉంచితే వెరిఫికేషన్ స్టేటస్ చూపిస్తుంది మరియు సైట్ సరైనదైతే బ్రౌజర్ చుట్టూ పచ్చని బోర్డర్ వస్తుంది. లేకుంటే వార్నింగ్ మెసేజ్ వస్తుంది.




Comodo Verification Engine వైరస్ ల నుండి, మాల్వేర్ల , యాడ్ వేర్ల నుండి పీసీ ని కాపాడుతుంది. దీనిలో యాంటీ ఫిషింగ్ సాప్ట్ వేర్ వుంది అది ఫిషింగ్ అటాక్స్ నుండి కాపాడుతుంది.

డౌన్లోడ్: Comodo Verification Engine

ధన్యవాదాలు

Friday, July 16, 2010

Webklipper - వెబ్ పేజీలలోని కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని మిత్రులకి పంపటానికి!!!

మనం ఏదైనా వెబ్ సైట్ చూస్తున్నప్పుడు దానిలో ఏదైనా ఆసక్తికరమైన విషయం కనబడితే ఆ టెక్స్ట్ ని హైలైట్ చేసి వెంటనే మిత్రులతో పంచుకోవటానికి Webklipper అనే సైట్ ఉపయోగపడుతుంది. దీంతో అవతలి వాళ్ళు మొత్తం పేజీ చదవకుండా హైలెట్ చేసింది మాత్రమే చదవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం:

౧. ముందుగా Webklipper సైట్ కి వెళ్ళి http:// దగ్గర కావలసిన వెబ్ సైట్ అడ్రస్ ఎంటర్ చేసి Klip It పై క్లిక్ చెయ్యాలి.



౨. ఇప్పుడు మనకి కావలసిన వెబ్ సైట్ ఓపెన్ అయ్యి Webklipper లోడ్ అవుతుంది, పేజీ అడుగున Webklipper టూల్ బార్ వస్తుంది.



౩. ఇప్పుడు కావలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని క్రిందవున్న Highlight పై క్లిక్ చెయ్యాలి. ఇదేవిధంగా పేజ్ మొత్తం లో హైలైట్ చెయ్యవలసిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అవసరమైతే కామెంత్లము కూడా జత చెయ్యవచ్చు.





౪. ఇప్పుడు ’Save' బటన్ పై క్లిక్ చెయ్యాలి తర్వాత ప్రక్కనే వున్న ’Share' పై క్లిక్ చేసి మిత్రులకు ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చు.


ధన్యవాదాలు

Thursday, July 15, 2010

Comodo నుండి ఉపయోగపడే ఉచిత సాప్ట్ వేర్లు...

Creating Trust online నినాదంతో ఎంతో ఉపయోగకరమైన సాప్ట్ వేర్లను Comodo మనకు ఉచితంగా అందిస్తుంది. వాటిలో కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం...ఇవి అందరకీ తెలిసినవి అయినా ఒక్కసారి మననం చేసుకుందాం!!!

1. Comodo Dragon:

క్రోమ్ ఆధారిత వేగవంతమైన మరియు సెక్యూరిటీ / ఫ్రైవసీ ఫీచర్లు కలిగిన ఇంటర్నెట్ బ్రౌజర్. ఆన్ లైన్ బ్యాంకింగ్ లేదా స్టాక్ ట్రేడింగ్ చేసే వారు Dragon ఉపయోగించటం ఉత్తమమం. Comodo Dragon పై మరింత సమాచారం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Comodo Dragon

2. Comodo Time Machine:

పీసీ సరిగా పనిచెయ్యనప్పుడు తిరిగి దానిని సరిగ్గా పనిచేసిన రోజుకు తిరిగి రీస్టోర్ చెయ్యటానికి Comodo Time Machine ఉపయోగపడుతుంది. విండోస్ సిస్టం టూల్స్ లో వచ్చే Sysytem Restore కి సరైన ప్రత్యామ్నాయం. Time Machine పై మరింత సమాచారం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Comodo Time Machine

3. Comodo Free Antivirus:
ఉచిత యాంటీ వైరస్ సాప్ట్ వేర్లలో ఇది కూడా ఒక ఉత్తమమైన మరియు ప్రభావంతమైన యాంటీవైరస్.
డౌన్లోడ్: Comodo Free Antivirus

4. Comodo Firewall:
పీసీ లో ప్రవేశించే అన్ ఆధరైజ్ద్ ఎంట్రీల నుండి ఫైర్ వాల్ కాపాడుతుంది. పర్సనల్ ఫైర్ వాల్ సాప్ట్ వేర్ల లో COMODO Personal Firewall బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిపై మరింత సమాచారం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్: Comodo Firewall

5. Comodo Backup:
ఏదైనా కారణాల వలన డాటా పోకుండా/కరప్ట్ కాకుండా సురక్షితంగా వుండాలంటే తరచూ బ్యాక్ అప్ తీసుకుంటూ వుండాలి. సాధారణంగా మనం మాన్యువల్ గా కావలసిన ఫైల్స్/ఫోల్డర్ లను హార్డ్ డిస్క్ లేదా స్టోరేజ్ డివైస్ లో తీసుకుంటాం. ఒక్కొక్కసారి మరచిపోతాం ...ఫైల్ లాస్/కరప్ట్ అయిన తర్వాత అయ్యో ముందే బ్యాక్ అప్ తీసుకుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అలా జరగకుండా ఒక షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఆటోమాటిక్ బ్యాక్ అప్ తీసుకోవటానికి నెట్ లో ఎన్నో వుచిత టూల్స్ లభిస్తున్నాయి. వాటిలో ఉత్తమమైనది Comodo Backup.
డౌన్లోడ్: Comodo Backup

6. Comodo System Cleaner:
పీసీ పేరుకుపోయిన టెంపరరీ ఫైళ్ళను తొలగించి దాని పనితనాన్ని మెరుగు పర్చటానికి Comodo System Cleaner ఉపయోగపడుతుంది. దీనిపై మరింత సమాచారం ఇక్కడ చూడండి.
డౌన్లోడ్:Comodo System Cleaner


7. Comodo Secure Email Encryption:
మెయిల్స్ ఎవరూ చదవకుండా వాటిని ఎన్ క్రిప్టెడ్ ఫార్మ్ లో సురక్షితంగా పంపటానికి ఈ యుటిలిటీ ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo Secure Email Encryption

8. Comodo EasyVPN:
మీ స్వంత మరియు మిత్రుల పీసీ లతో స్వంత వర్చువల్ ఫ్రైవేట్ నెట్వర్క్ (VPN) క్రియేట్ చేసుకోవటానికి Comodo EasyVPN ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo EasyVPN

9. Comodo Disk Encryption:
డిస్క్ లోని డాటాని ఎన్ క్రిప్ట్ చెయ్యటానికి Comodo Disk Encryption ఉపయోగపడుతుంది.
డౌన్లోడ్: Comodo Disk Encryption

ధన్యవాదాలు

Wednesday, July 14, 2010

10 GB మరియు అంతకన్నా ఎక్కువ ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ అందిస్తున్న వెబ్ సైట్లు ...

డిజిటల్ ప్రపంచం లో మన జీవితం ఇంటా బయట ఆపీస్ లో నిరంతరం కంప్యూటర్ తో ముడిపడి వుంది. ఆఫీస్ లో చేసిన ఫైళ్ళను ఇంట్లో లేదా ఇంట్లో చేసిన పనిని ఆపీస్ లో యాక్సెస్ చెయ్యాలనుకున్నా లేదంటే డాటా బ్యాక్ అప్ తీసుకోవాలనుకున్నా ఆన్ లైన్ స్టోరేజ్ ఉపయోగపడుతుంది. డాటాని మనతో తీసుకొని వెళ్ళనవసరం లేకుండా ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. కొన్ని సైట్లు ఉచితంగా 10 GB మరియు అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ని అందిస్తున్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఇస్తున్నాను:

1. SkyDrive:
విండోస్ లైవ్ స్కైడ్రైవ్ - మైక్రోసాప్ట్ అందిస్తున్న క్లౌడ్ ఆధారిత సర్వీస్. విండోస్ లైవ్ అకౌంట్ తో 25 GB వరకు ఉచిత స్టోరేజ్ స్పేస్ ని పొందవచ్చు. డెస్క్ టాప్ క్లైంట్ ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. చెయ్యవలసినదంతా SkyDrive సైట్ కి వెళ్ళి విండోస్ లైవ్ ఐడీ తో లాగిన్ చెయ్యటమే , ఒకవేళ ఐడీ లేకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవచ్చు. క్రొత్త ఫోల్డర్లను క్రియేట్ చేసుకోవచ్చు మరియు వాటిని షేర్ చేసుకోవచ్చు, వద్దనుకొంటే ఫోల్డర్లను పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.

సైట్: SkyDrive

2. IDrive:
ఐడ్రైవ్- రిమోట్ ఆన్ లైన్ బ్యాక్ అప్ సొల్యూషన్. అన్నిటిలానే ఐడ్రైవ్ కూడా 2GB స్టోరేజ్ స్పేస్ నే అందిస్తుంది, కానీ IDrive సైట్ కి వెళ్ళి సైన్ అప్ చేసిన తర్వాత Confimation and Refferal పేజీ రీడైరెక్ట్ చెయ్యబడుతుంది, అక్కడ ప్రచారం లో భాగంగా IDrive ని మీ మిత్రులకు రిఫర్ చెయ్యటం ద్వారా 10 GB ఉచిత స్పేస్ ని పొందవచ్చు.
సైట్: IDrive

3. humyo:
humyo లో కూడా 10 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ వుంటుంది, దానిలో 5 GB మీడియా ఫైళ్ళ కోసం అంటే ఫోటోస్, వీడియోస్, మ్యూజిక్ స్టోర్ చేసుకోవచ్చు మిగతా 5GB నాన్ మీడియా ఫైళ్ళ ను స్టోర్ చేసుకోవచ్చు.
సైట్: humyo

4. Binfire:
ఇది కూడా పైన చెప్పిన సైట్ల లాగే 10 GB ఉచిత స్టోరేజ్ స్పేస్ ని అందిస్తుంది.

సైట్: Binfire

ధన్యవాదాలు

Stress Management పై ప్రెజెంటేషన్ !!!

ఒత్తిడి అనేక శారీరక మానసిక రుగ్మతలకు దారితీస్తుంది. ఒత్తిడిని తగ్గించుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవటం వలన చాలా వరకు బ్రెయిన్ మరియు గుండెకి సంబంధించిన జబ్బులనుండి బయటపడవచ్చు, స్ట్రెస్ మేనేజ్మెంట్ పై నాకు వచ్చిన మెయిల్ ని మీతో పంచుకుంటున్నాను.



సర్వేజనా సుఖినోభవంతు!!!

ధన్యవాదాలు

Tuesday, July 13, 2010

FamilyShield - అడల్ట్ వెబ్ సైట్లను పిల్లలు చూడకుండా బ్లాక్ చెయ్యటానికి...

అడల్ట్ వెబ్ సైట్లను పిల్లలు చూడకుండా OpenDNS ఉపయోగించి ఎలా బ్లాక్ చెయ్యాలో ఒంతకు ముందు చేసిన OpenDNS పోస్ట్ ని ఇక్కడ చూడండి. OpenDNS నుండి వచ్చిన సింపుల్ సొల్యూషనే/వెర్షనే FamilyShield.

FamilyShield సెటప్ గురించి ఇప్పుడు చూద్దాం:

ముందుగా FamilyShield సైట్ కి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే కనుక Continue without signing up దగ్గర క్లిక్ చేస్తే FamilyShield సెటప్ Router లేదా Computer లలో దేనిలో సెట్ చెయ్యాలో దానిని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా దానికి సంబంధించిన సూచనలు వస్తాయి. Computer అని సెలెక్ట్ చేసుకొంటే కనుక తర్వాత వచ్చే పేజీలో మన పీసీ ఆపరేటింగ్ సిస్టం ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొన్న తర్వాత FamilyShield ఎలా కాన్ఫిగర్ చెయ్యలో స్టెప్ బై స్టెప్ ఇనస్ట్రక్షన్లు చాలా చక్కగా వివరించారు. దానిని ఫాలో అయితే సరిపోతుంది. సెట్టింగ్స్ పూర్తి అయిన తర్వాత సైట్ లో Test Your New Settings పై క్లిక్ చేసి మనం చేసిన సెట్టింగ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా తెలుస్తుంది.

FamilyShield సంబంధించిన వీడియో డిజిటల్ ఇన్స్పిరేషన్ నుండి:


వెబ్ సైట్: FamilyShield

ధన్యవాదాలు

etype - ఏదైనా అప్లికేషన్ లో టైప్ చేస్తున్నప్పుడు ఆటోమాటిక్ గా పదాన్ని పూర్తి చెయ్యటానికి!!!

ఏదైనా అప్లికేషన్ లో టైప్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ తప్పులు రాకుండా సరైన పదాలను సూచించి మరియు ఆటోమాటిక్ గా ఆ పదాన్ని పూర్తిచెయ్యటానికి etype అనే ఉచిత అప్లికేషన్ సహాయపడుతుంది.

etype సైట్ కి వెళ్ళి E-mail అడ్రస్ ఎంటర్ చేసి Free Download బటన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. etype ఇనస్టలేషన్ సమయం లో ఉపయోగించటానికి యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ క్రియేట్ చెయ్యబడతాయి, అవే మన మెయిల్ ఐడీ కూడా పంపబడతాయి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత etype సిస్టం ట్రే లో కూర్చుంటుంది. మనం ఏదైనా అప్లికేషన్ (నోట్ ప్యాడ్, వర్డ్, వెబ్ భ్రౌజర్) లో టైప్ చేస్తున్నప్పుడు కొన్ని అక్షరాలు టైప్ చెయ్యగానే etype ఆటోమాటిక్ గా ఓపెన్ అయ్యి మనం టైప్ చెయ్యబోయే పదాన్ని ఊహించి కొన్ని పదాలను సూచిస్తుంది, వాటిలో మనకు కావలసిన పదం వుంటే కనుక సెలెక్ట్ చేసుకొని 'Enter' ప్రెస్ చెయ్యాలి. అంతే ఆ పదం మన వాక్యం లో చేరుతుంది. etype వద్దనుకొంటే సిస్టం ట్రే లో వున్న ఐకాన్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి Disable/ enable చేసుకోవచ్చు.


డెమో:


డౌన్లోడ్: etype
వెబ్ సైట్: etype

ధన్యవాదాలు

Monday, July 12, 2010

Microsoft WebMatrix - వెబ్ సైట్ డెవలప్ మెంట్ టూల్...

వెబ్ సైట్లను డెవలప్ చెయ్యటానికి మైక్రోసాప్ట్ ఇటీవలే WebMatrix అనే టూల్ ని విడుదల చేసింది. విండోస్ ఉపయోగించి వెబ్ సైట్స్ డెవలప్ చెయ్యటానికి కావలసినవన్నీ ఈ వెబ్ మ్యాట్రిక్స్ లో వున్నాయి. దీనిలో IIS Developer Express (a development Web server), ASP.NET (a Web framework), మరియు SQL Server Compact (an embedded database)వున్నాయి.

వెబ్ మ్యాట్రిక్స్ కి సంబంధించిన వీడియో ని ఇక్కడ చూడండి.



వెబ్ మ్యాట్రిక్స్ డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Wednesday, July 7, 2010

RecoveryDesk - సిస్టం నుండి తొలగించబడిన ఫైళ్ళను తిరిగిపొందటానికి...

హార్డ్ డిస్క్ (NTFS, FAT12, FAT16, FAT32 పార్టీషన్లు) మరియు రిమూవబుల్ మీడియా(SD, CF, MS, MMC, Flash Card, USB drive) నుండి తొలగించబడిన ఫైళ్ళను తిరిగిపొందటానికి RecoveryDesk అనే ఉచిత చిన్న మరియు సమర్ధవంతమైన డాటా రికవరీ టూల్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించటం చాలా సులువు. ముందుగా RecoveryDesk సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ని రన్ చేసినప్పుడు 'Windows Explorer' లాంటి ఇంటర్ ఫేస్ ని కలిగి వుంటుంది. ’Scan' లేదా ’Full Scan' పై క్లిక్ చెయ్యటం ద్వారా డిలీట్ చెయ్యబడిన ఫైళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. కావలసిన డ్రైవ్ లేదా ఫోల్డర్ ని కూడా స్కాన్ చేసుకోవచ్చు. రికవర్ చెయ్యవలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకొని Recover బటన్ ని ప్రెస్ చెయ్యాలి. రికవర్ చేసే ఫైళ్ళను అదే డ్రైవ్ లో రీస్టోర్ చెయ్యటం వలన్ ఫైల్ స్ట్రక్చర్ దెబ్బతినే అవకాశం వుంది లేదా సరిగ్గా ఫైల్ రికవర్ కాకపోవచ్చు. కాబట్టి నెట్ వర్క్ లోని వేరొక సిస్టం లేదా USB డ్రైవ్ లలో ఫైల్/ఫోల్డర్ రీస్టోర్ చేసుకోవటం ఉత్తమం.



RecoveryDesk విండోస్ 2000/XP/2003/2008/Vista/7 లలో పని చేస్తుంది.

డౌన్లోడ్: RecoveryDesk (సైజ్: 878 Kb)

ధన్యవాదాలు

NComputing నుండి L300 ఈథర్నెట్ వర్చువల్ డెస్క్ టాప్ లు ...

Thin Client టెక్నాలజీ మాదిరి గానే NComputing Inc. వారు ఈధర్నెట్ వర్చువల్ డివైస్ ని రూపొందించారు. ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో మోనిటర్, కీబోర్డ్, మౌస్ మరియు L 300 డివైజ్ వుంటాయి. అవసరం అనుకొంటే L 300 డివైజ్ కి USB ఆధాతిత డివైజ్ లు, స్పీకర్లు మరియు మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డెస్క్ టాప్ తీసుకోవాలి, దాని CPU తో వర్చువల్ డెస్క్ టాప్ ని అను సంధానం చెయ్యటం ద్వారా ఆ CPU లోని అప్లికేషన్లన్నీ ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో పొందవచ్చు. ఇలా ఒకే CPU కి L300 డివైజ్ సహాయం తో 30 వర్చువల్ డెస్క్ టాప్ లు కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్లు అన్నీ ఒకే చోట వుంటాయి. మెయింటెనెన్స్ భారం మరియు ఖర్చు తగ్గుతాయి. నెట్ సెంటర్లు, కాల్ సెంటర్లు, స్కూల్, కాలేజ్ మరియు చిన్న/ మధ్యతరహా కార్యాలయాలలో ఈ వర్చువల్ డెస్క్ టాప్ లను ఉపయోగించవచ్చు.

NComputing L300 ఈథర్నెట్ వర్చువల్ డెస్క్ టాప్ కి సంబందించిన వీడియో:



మరింత సమాచారం కోసం NCompting సైట్ చూడండి.

ధన్యవాదాలు

Monday, July 5, 2010

Mixxx - DJ ల కోసం మ్యూజిక్ మిక్సింగ్ సాప్ట్ వేర్...

మిక్స్ డ్ మ్యూజిక్ తయారు చెయ్యటం కోసం DJ ల కోసం DJ లచే ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ Mixx...


మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు Mixxx సైట్ చూడండి.
ధన్యవాదాలు

Friday, July 2, 2010

USB Write Protect - USB డ్రైవ్ లు వైరస్ ల బారిన పడకుండా కాపాడటానికి!!!

USB డ్రైవ్ లు సులభంగా వైరస్ ల బారిన పడతాయి. USB డ్రైవ్ లను ఏదైనా పీసీ కి కనెక్ట్ చేసినప్పుడు వైరస్ లు దానిలోకి ప్రవేశించకుండా USB Write Protect అనే ఉచిత యుటిలిటీ ని ఉపయోగించి write protect చెయ్యవచ్చు. అంతేకాకుండా పొరపాటున డాటా డిలీట్ లేదా మాడిఫై చెయ్యటాన్ని కూడా అరికట్టవచ్చు. USB Write Protect ఒక చిన్న ఉచిత యుటిలిటీ, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత అన్ జిప్ చేసి USBWriteProtect ఫైల్ ని USB drive లోకి కాపీచేసుకొని తర్వాత దానిపై డబల్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు. USBWriteProtect ఓపెన్ అయిన తర్వాత Protection దగ్గర వున్న రెండు ఆప్షన్లలో Enable Write Protect ని సెలెక్ట్ చేసుకొని Apply బటన్ క్లిక్ చేసేముందు ఒకసారి USB drive ని తొలగించి తిరిగి మరల కనెక్ట్ చెయ్యాలి.



ఇప్పుడు Apply బటన్ పై క్లిక్ చేసి చివరగా Close బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే మీ USB Drive write protect చెయ్యబడింది ఇప్పుడు దీనిలో క్రొత్త ఫైల్/ఫోల్డర్ క్రియేట్ లేదా కాపీ చెయ్యలేము.

write protect డిసేబుల్ చెయ్యటానికి కూడా పైన చెప్పిన పద్ధతే. Disable Write Protect ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని USB Drive తొలగించి తిరిగి కనెక్ట్ చేసి Apply బటన్ పై క్లిక్ చెయ్యాలి.

డౌన్లోడ్: USB Write Protect (సైజ్ : 11KB)

ధన్యవాదాలు