ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా, ఫైళ్ళను సర్వర్ కి అప్ లోడ్ చెయ్యకుండా, ఫైల్ సైజ్ లిమిట్ లేకుండా dushare - P2P ఫైల్ ట్రాన్స్‌ఫర్ సైట్ నుండి పెద్ద ఫైళ్ళను సురక్షితంగా ట్రాన్స్‌ఫర్ చెయ్యవచ్చు. dushare అందిస్తున్న ఉచిత వెబ్ సర్వీస్.
ముందుగా dushare సైట్ కి వెళ్ళాలి.
'Send File' పై క్లిక్ చేసి మనం కావలసిన వారికి పంపవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ పాస్ వార్డ్ పెట్టాలనుకుంటే కనుక ’Password Protected’ దగ్గర టిక్ చేసి కావలసిన పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. పంపవలసిన ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లింక్ వస్తుంది. ’Copy Link' పై క్లిక్ చేసి ఆ లింక్ ని కాపీ చేసుకోవచ్చు.

ఆ లింక్ కావలసిన వారికి ఇస్తే వారు దానిని ఉపయోగించి ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు.
వెబ్ సైట్: dushare
ధన్యవాదాలు