Friday, October 1, 2010

Windows Live Essentials 2011 - డెస్క్‌టాప్ అప్లికేషన్ల సమాహారం!!!

మైక్రోసాప్ట్ Windows Live Essentials 2011 డౌన్లోడ్ కి సిద్ధంగా ఉంది. Windows Live Essentials 2011 లో వివిధ డెస్క్‌టాప్ అప్లికేషన్లు ఉన్నాయి. అవి:

1.Messenger: ఇనస్టంట్ మెసేజింగ్ తో పాటు సోషల్ నెట్‌వర్క్ సపోర్ట్ కూడా ఉంది. దీంటో చాట్ చేస్తూనే ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేసుకోవచ్చు.




ఫోటో మేనేజ్‌మెంట్ అప్లికేషన్ - ఫోటో గ్యాలరీ నుండే ఫోటోలను/ వీడియోలను డైరెక్ట్ గా Facebook, Flickr కి అప్‌లోడ్ చేసి షేర్ మరియు పబ్లిష్ చెయ్యవచ్చు.



3.Movie Maker: మూవీ ఎడిటింగ్ మరియు పబ్లిషింగ్ టూల్ - ఫోటోలను మరియు వీడీయోలకు స్పెషల్ ఎఫెక్ట్స్, ట్రాన్‌సిషన్స్, సౌండ్ మరియు కాప్షన్లను జతచేసి అందమైన మూవీలను తయారు చెయ్యవచ్చు.



4. Windows Live mesh: ఫైల్ సింకింగ్ యుటిలిటీ. మన పీసీ లోని ఫైళ్ళు/ ఫోల్డర్లను SkyDrive లోని synced storage space తో సింక్ చెయ్యటం వలన మనం ఎక్కడైనా ఎప్పుడైనా అప్‌డేటెడ్ ఫైళ్ళను పొందవచ్చు.



5.Mail: డెస్క్ టాప్ ఈ-మెయిల్ క్లైంట్ - మనకున్న అన్ని ఈ-మెయిల్ అకౌంట్లను (జీమెయిల్, హాట్ మెయిల్, యాహూ మెయిల్ మొ.) యాడ్ చేసి చూడవచ్చు. ఈమెయిల్ తో పాటు క్యాలండర్, కాంటాక్ట్ లను నెట్ సదుపాయం లేనప్పుడు కూడా చూడవచ్చు.



6. Writer: శక్తివంతమైన డెస్క్ టాప్ బ్లాగింగ్ సాప్ట్ వేర్. బ్లాగ్ పోస్ట్ లను WordPress, Blogger, LiveJournal మొ. వాటిలో పబ్లిష్ చెయ్యటానికి సపోర్ట్ చేస్తుంది.



7. Family Safety: ఆన్ లైన్ లో పిల్లల యాక్టివిటీలను తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది.



పైన చెప్పిన డెస్క్ టాప్ అప్లికేషన్ల క్రొత్త వెర్షన్ Windows 7 లేదా Windows Vista లో మాత్రమే పని చేస్తాయి.

డౌన్లోడ్: Windows Live Essentials 2011

ధన్యవాదాలు