LiberKey లో ఉన్న పోర్టబుల్ సాప్ట్వేర్లను మన ఫ్లాష్ డ్రైవ్ లో ఇనస్టలేషన్ చేసుకొని ఎంచక్కా మనతోపాటు తీసుకొని వెళ్ళవచ్చు. LiberKey యూజర్ ఫ్రెండ్లీ మెనూ ని కలిగి ఉంటుంది మరియు అప్లికేషన్లన్నీ వివిధ క్యాటగిరీల్లో ఒక పధ్ధతిలో ఉంటాయి అవి Audio, Video, Graphics, Internet, Games, Security, Education, System మొదలగునవి.
LiberKey మూడు రకాల సూట్ల లో (Basic, Statndard, Ultimate) లభిస్తుంది. కావలసిన సూట్ సెలెక్ట్ చేసుకొని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
LiberKey Basic: 12 అప్లికేషన్లు ఉన్నాయి , డౌన్లోడ్ సైజ్ : 37.30 MB, ఇనస్టలేషన్ సైజ్ : 113.25 MB
LiberKey Standard: 89 అప్లికేషన్లు ఉన్నాయి , డౌన్లోడ్ సైజ్ : 176.21 MB, ఇనస్టలేషన్ సైజ్ : 468.40 MB
LiberKey Ultimate: 164 అప్లికేషన్లు ఉన్నాయి , డౌన్లోడ్ సైజ్ : 233.12 MB, ఇనస్టలేషన్ సైజ్ : 618.66 MB
దీనిలోవున్న మరొక ముఖ్యమైన ఫీచర్ మన మెనూ లిస్ట్ ని ఆన్లైన్ క్యాటలాగ్ తో సింక్రనైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఏదైనా సాప్ట్వేర్ క్రొత్త వెర్షన్ పబ్లిష్ అయినప్పుడు సింక్రనైజ్ మెనూ ఆప్షన్ ద్వారా మన అప్లికేషన్ ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఏ యితర పొర్టబుల్ ప్యాకెజీలలో లేనన్ని పోర్టబుల్ అప్లికేషన్లు LiberKey లో ఉన్నాయి.
డౌన్లోడ్: LiberKey
ధన్యవాదాలు