Friday, October 15, 2010

RemindPost - ఉచిత టాస్క్‌మేనేజ్‌మెంట్ వెబ్అప్లికేషన్!!!

ఎటువంటి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్, రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ReimdPost సైట్ కి వెళ్ళి కావలసిన వారికి ఎంచుకున్న తారీఖున చెయ్యవలసిన టాస్క్ ని పంపవచ్చు, అంతేకాదు టాస్క్ పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు.ReimdPost సైట్ కి వెళ్ళి Assignee's email దగ్గర టాస్క్ పంపవలసిన వారి e-mail ఐడి, Task Details దగ్గర టాస్క్ వివరాలు, Your email దగ్గర మన e-mail ఐడి ఎంటర్ చెయ్యాలి. తర్వాత క్రింద వున్న డ్రాప్‌డౌన్ మెనూ లో టాస్క్ పంపవలసిన రోజు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Send' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

ముందుగా ReimdPost నుండి మెయిల్ మన ఐడీ కి పంపబడుతుంది. మనకు వచ్చిన మెయిల్ లో 'Activate Task’ పై క్లిక్ చెయ్యాలి, ఇప్పుడు టాస్క్ అవతలి వారికి పంపబడుతుంది. ఇక్కడ టాస్క్ ని Edit లేదా Cancel చేసే అవకాశం కూడా ఉంది.ఇప్పుడు అవతలి వారు తమకు యిచ్చిన టాస్క్ పూర్తి చేసి ఆ సమాచారాన్ని మనకు పంపవచ్చు, దానికోసం వాళ్ళు ReimdPost నుండి వచ్చిన మెయిల్ లో Complete Task పై క్లిక్ చేసి అవసరం అనుకొంటే Notes ఎంటర్ చేసి ’Submit' బటన్ పై క్లిక్ చెయ్యటమే.
వెబ్ సైట్:ReimdPost

ధన్యవాదాలు