Friday, October 22, 2010

kidblog.org - విద్యార్ధుల కోసం సురక్షితమైన మరియు సింపుల్ క్లాస్ బ్లాగ్స్ క్రియేట్ చెయ్యటానికి!!!

విద్యార్ధుల కోసం సురక్షితమైన మరియు సింపుల్ బ్లాగ్స్ క్రియేట్ చెయ్యటానికి ఉపాధ్యాయులచే ఉపాధ్యాయుల కోసం అందిస్తున్న ఉచిత బ్లాగింగ్ సర్వీస్ kidblog.org. ప్రతీ క్లాస్ కి ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకొని ప్రతీ విద్యార్ధికి ఒక యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ క్రియేట్ చేసి విద్యార్ధులు తమ పోస్టులను పబ్లిష్ చెయ్యవచ్చు మరియు డిస్కషన్లలో కూడా పాల్గొనవచ్చు. బ్లాగ్ క్రియేట్ చెయ్యటం కూడా చాలా సులువు, బ్లాగుల ప్రైవసీ మరియు సెక్యూరిటీ భాద్యత kidblog.org నే తీసుకుంటుంది. kidblog.org లో బ్లాగ్ క్రియేట్ చెయ్యటం ఎలానో తెలుసుకుందాం...

ముందుగా kidblog.org కి వెళ్ళి టీచర్ రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత 'Click to Create a Class' దగ్గర క్లిక్ చేసి Class Name ఎంటర్ చేసి Add Class పై క్లిక్ చెయ్యాలి, లేదంటే kidblog.org సైట్ కి వెళ్ళి డైరెక్ట్ గా 'Click to Create a Class' దగ్గర క్లిక్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అంతే క్లాస్ బ్లాగ్ క్రియేట్ అవుతుంది. 'Add users to this class' దగ్గర క్లిక్ చేసి విద్యార్ధులకు యూజర్ నేమ్, పాస్ వార్డ్ మరియు వాళ్ళ రోల్ ఇవ్వవచ్చు.



మనం యాడ్ చేసిన యూజర్లు మాత్రమే పోస్టులు చూడగలరు, తల్లిదండ్రులను కూడా గెస్ట్ లు గా యాడ్ చేసి క్లాస్ వర్క్ తెలుసుకొనే అవకాశం కూడా వుంది. కామెంట్ మోడరేషన్ సదుపాయం కూడా వుంది.

వెబ్ సైట్: kidblog.org