Monday, October 18, 2010

వెబ్‌పేజీలను ప్రింట్ చేసేటప్పుడు ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించటానికి ఉచిత సాప్ట్‌వేర్లు!!!

సాధారణంగా వెబ్ పేజీలను ప్రింట్ చేసేటప్పుడు కావలసిన టెక్స్ట్ తో పాటు అనవసర ఇమేజ్లతో వృధాగా ఒకటి లేదా రెండు పేజీలు ప్రింట్ అవటం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి GreenPrint అనే ఉచిత సాప్ట్‌వేర్ ఉపయోగపడుతుంది, దీనిని గురించి ఇదివరకే పోస్ట్ చెయ్యటం జరిగింది, దానిని ఇక్కడ చూడండి. ఇలాంటివే మరికొన్ని సాప్ట్‌వేర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

1.PrintWhatYouLike:
వెబ్ పేజీలను ప్రింట్ చేసేముందు వాటిలోని అనవసరమైన యాడ్స్ మరియు ఇమేజ్‌లను తొలగించి ప్రింట్ చేసే పేజీలు తగ్గించటం లో ఈ వెబ్ అప్లికేషన్ సహాయపడుతుంది. PrintWhatYouLike సైట్ కి వెళ్ళి మనం ప్రింట్ చెయ్యవలసిన సైట్ URL ఎంటర్ చేసి Start బటన్ పై క్లిక్ చెయ్యాలి. తర్వాత వచ్చే టూల్ లో ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు మరియు బ్యాక్‌గ్రౌండ్, ఇమేజెస్, మార్జిన్స్ దగ్గర ఉన్న Hide ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. అనవసరమైన టెక్స్ట్ ని మౌస్ తో సెలెక్ట్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ నుండే తీసుకోవచ్చు. PrintWhatYouLike కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.



వెబ్‌సైట్: PrintWhatYouLike

2.The Printlimnator:
ఇది కూడా పైన చెప్పిన అప్లికేషన్ లాగానే యాడ్స్ ని మరియు అనవసరపు టెక్స్ట్ ని తొలగిస్తుంది. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.


వెబ్‌సైట్: The Printlainator

3. Nuka Anything Enhanced:
ఇది ఫైర్‌ఫాక్స్ యాడ్-ఆన్, దీనిని ఉపయోగించి కాంటెక్స్ట్ మెనూ ద్వారానే అనవసరమైన ఆబ్జెక్ట్ , టెక్స్ట్ ని తొలగించవచ్చు.


డౌన్లోడ్: Nuka Anything Enhanced

4. HP Web Page Printing:
ఇది బ్రౌజర్ ప్లగిన్, దీనికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: HP Web Page Printing
ధన్యవాదాలు