మన పీసీ ఫైళ్ళను ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యటానికి చాలా ఉచిత సాప్ట్ వేర్లు నెట్ లో దొరుకుతాయి, వాటిలో ఒకటే ఈ ZumoCast - సింపుల్ మరియు ఎటువంటి పరిధులు లేని ఉచిత రిమోట్ యాక్సెస్ అప్లికేషన్. మన పీసీ లో ZumoCast ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఫైళ్ళను క్లౌడ్ లోకి అప్ లోడ్ చెయ్యకుండానే ఎక్కడ నుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. దాని కోసం ముందుగా ZumoCast ని డౌన్లోడ్ చేసుకొని మన సిస్టం లో ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత ZumoCast సిస్టం ట్రే లో కూర్చుంటుంది. దాని పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Sign in' పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత రిమోట్ లో యాక్సెస్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. రిమోట్ లో యాక్సెస్ చెయ్యటానికి మన పీసీ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేలా చూసుకోవాలి.
ఇప్పుడు నెట్ కనెక్షన్ వున్న వేరొక సిస్టం లో http://www.zumocast.com/ సైట్ కి వెళ్ళి 'Sign In' పై క్లిక్ చేసి ముందుగా క్రియేట్ చేసుకున్న ఐడి, పాస్ వార్డ్ లతో Sign In చెయ్యాలి. అంతే మన పీసీ లో సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లు యిక్కడ ప్రత్యక్షం.
డౌన్లోడ్: ZumoCast
ధన్యవాదాలు